NTV Telugu Site icon

Kane Willamson : ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ కు కివీస్ కెప్టెన్ దూరం..

Kane Williamson

Kane Williamson

ఐపీఎల్ మెగాటోర్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చిన్న క్రికెటర్ల నుంచి మేటి క్రికెటర్ల వరకు ఈ మెగగాలీగ్ లో ఆడేందుకు ఇష్టపడతారు. ఈ లీగ్ లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఈవెంట్ నిర్వహించే సమయంలో సొంత దేశంలో సిరీస్ లు ఉన్నా.. ఇందులో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా అదే చేశాడు. ఐపీఎల్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ముందే విడిచిపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్న విలియమ్సన్ వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు.. దీంతో ఆ వన్డే సిరీస్ లో కివీస్ టీమ్ కు టామ్ లాథమ్ కెప్టెన్ గా వ్యవహించానున్నాడు.

Also Read : Pawan Kalyan Varahi Live: జనసేన వారాహి ర్యాలీ లైవ్

గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో విలియమ్సన్ ను.. గుజరాత్ టైటాన్స్ జట్టు.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మంచి ఫామ్ లోఉన్న అతడు.. ఇక ఐపీఎల్ లో సత్తా చాటేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు ఐపీఎల్ కోసం విలియమ్సన్ తో పాటు డేవాన్ కాన్వే( సీఎస్కే), టీమ్ సౌథీ(కేకేఆర్), మిచెల్ సాంట్నర్ను( సీఎస్కే)ను కూడా వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త యంగ్ ప్లేయర్లు ఆడనున్నారు. ఇప్పటికే లంకతో మూడు వన్డేల సిరీస్ కోసం చాడ్ బోవాస్, బెన్ లిస్టర్ ను న్యూజిలాండ్ బోర్డు సెలెక్ట్ చేసింది. అలాగే మార్చి 25న జరగనున్న తొలి వన్డే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్( కేకేఆర్), ఫిన్ అలెన్(ఆర్సీబీ), గ్లెన్ ఫిలిప్(ఎస్ఆర్హెచ్) కూడా ఐపీఎల్ కోసం భారత్ కు చేరుకోనున్నారు.

Also Read : Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..

ఈ విషయంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త ప్లేయర్స్ ఎప్పుడూ ఉండటం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందని కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. అలాగే నిర్థిష్ట ఫార్మాట్ లో ఆటగాళ్లకు అవకాశాలిచ్చి తీర్చిదిద్దడం ఎప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, లంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ (121 నాటౌట్, 194 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ ) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఆఖరి బంతి వరకు పోరాడి న్యూజిలాండ్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడు అద్భుత సెంచరీ కొట్టడంతో ఈ మ్యాచ్ లో శ్రీలంక రెండె వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో కివీస్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో కివీస్ గెలవడంతో.. లంక ఓడిపోవడంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరేందుకు మార్గం క్లీయరైంది.