రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సరికొత్త రికార్డ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది.
శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 92వ విజయం. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై పాకిస్థాన్ అన్నేసార్లు విజయం సాధించాయి. ఇవాళ శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలోనూ గబ్బర్ సేన విజయం సాధిస్తే… ఒకే జట్టుపై అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన ప్రపంచ రికార్డు… భారత్ సొంతమవుతుంది.
Also Read
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
- Mitchell Starc History: మిచెల్ స్టార్క్ నయా చరిత్ర.. టెస్టు క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ రారాజు!
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్పే భారత్‌కు బలం. కెప్టెన్ శిఖర్‌ధావన్‌తో పాటు యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే… అంతా హార్డ్ హిట్టర్లే. వీళ్లకు కళ్లెం వేయడం అంటే… ప్రస్తుత లంక జట్టుకు శక్తికి మించిన పనే. బౌలింగ్‌లోనూ మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్య తొలివన్డేలో ఆకట్టుకునేలా బౌలింగ్ వేశారు. వీళ్లకి తోడు హార్దిక్ పాండ్యా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎలాగూ ఉన్నారు. అంతా కలిసి లంక పని పడితే… రెండో వన్డేలోనూ గెలుపు ఖాయమన్న ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక లంక జట్టులో కూడా సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే నిలకడగా ఆడి భారీ స్కోర్లు సాధించడంలో మాత్రం విఫలమవుతున్నారు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడితే… భారీ స్కోరు ఖాయమని నమ్మకంగా ఉన్నారు… లంక ఫ్యాన్స్. అయితే లంక బౌలింగ్ విభాగం మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు తప్ప తొలి వన్డేలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లంక బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు కళ్లెమేయాలంటే… కష్టపడక తప్పదు. రెండో వన్డేలో గెలిచి భారత్ కొత్త రికార్డు అందుకుంటుందా? లేక లంక రెచ్చిపోయి సిరీస్‌ను సమం చేస్తుందా? అనేది ఇవాళ తేలిపోతుంది.
తాజావార్తలు
-
India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!