Site icon NTV Telugu

Neeraj Chopra: మరో ఫీట్ సాధించిన నీరజ్‌ చోప్రా.. కోర్టానే గేమ్స్‌లో స్వర్ణం

Neeraj Chopra

Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరో ఫీట్‌ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా అంతకుముందు గత వారం తుర్కులో 89 మీటర్ల రికార్డును సాధించాడు.

ప్రపంచ ఛాంపియన్, గ్రెనెడా దేశస్థుడు అండర్సన్ పీటర్స్‌ను వెనక్కినెట్టి ఈ పతకం సాధించడం విశేషం. తొలి ప్రయత్నంలో రికార్డు దూరం విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. అప్పటికే పతకం ఖాయమైన నేపథ్యంలో మిగిలిన మూడు ప్రయత్నాలు చేయకుండానే విరమించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బల్లెం విసరడం ఆటగాళ్లకు కష్టమైంది. ఈ క్రమంలోనే మూడో ప్రయత్నంలో నీరజ్ పట్టు కోల్పోయి జారాడు. ట్రినిడాడ్‌కు చెందిన వాల్కట్ కెషోర్న్ బల్లెంను 86.64 మీటర్లు విసిరి రెండోస్థానంలో నిలవగా.. 84.75 మీటర్లు విసిరిన అండర్సన్ పీటర్స్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 86.89 మీటర్లు విసిరాడు. దీని తర్వాత, అతని తదుపరి ప్రయత్నం ఫౌల్, మూడవ ప్రయత్నంలో అతను జావెలిన్ విసురుతూ జారిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.

ఈ ఏడాది జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాలని చోప్రా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇలాగే చేస్తానని, పతకం గెలుస్తానో లేదో ఫలితం వస్తుందో చూద్దాం అని కొద్ది రోజుల క్రితం శిక్షణలో పేర్కొన్నాడు. గతేడాది ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించానని కాదు, ఈ ఏడాది కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలి. భవిష్యత్తు కోసం నేను ఇంకేం చేయగలనో చేస్తాను. కొంత ఒత్తిడి ఉంటుంది, అది సహజమని ఆయన అన్నారు.

Exit mobile version