Naveen Ul Haq Gives Clarity On Sorry Tweet: ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీతో లక్నో సూపర్ జెయింట్ పేసర్ నవీన్ ఉల్ హల్ గొడవ పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుంచి కోహ్లీ ఫ్యాన్స్ అతడ్ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీని ఉద్దేశిస్తూ అతడు ఏ పోస్ట్ పెట్టినా.. వెంటనే ఘాటుగా బదులిస్తున్నారు. చెంపఛెళ్లుమనేలా అతనికి బుద్ధి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ ఉల్ హక్ పేరిట ఉన్న ఓ ట్విటర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ‘‘నేను చేసింది ముమ్మాటికీ తప్పే, ఇందుకు నేను విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్తున్నాను. కోహ్లీ సార్, నేను మీకు పెద్ద అభిమానిని. లక్నోని వదిలి మీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడాలనుంది’’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొని ఉంది.
Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
ఆ ట్వీట్ చూసి.. నవీన్ నిజంగానే కోహ్లీకి సారీ చెప్పాడని, అతడు పశ్చాత్తాపపడుతున్నట్లున్నాడని అనుకున్నారు. అయితే.. కొద్ది గంటల తర్వాత ఆ ట్వీట్ తాను చేయలేదని నవీన్ ఉల్ హక్ కుండబద్దలు కొట్టాడు. అసలు ఆ ట్విటర్ అకౌంట్ తనది కాదని, ఎవరో తన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నారని, తాను కోహ్లీకి క్షమాపణలు చెప్పలేదని పేర్కొన్నాడు. ‘‘నా పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ సృష్టించారు. ఈ ఖాతా నుంచి మెసేజ్‌లు వస్తే, స్పందించకండి. వెంటనే రిపోర్ట్ కొట్టండి’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చాడు. ఇంకేముంది.. మరోసారి కోహ్లీ, భారత క్రీడాభిమానులు అతడ్ని టార్గెట్ చేశారు. కోహ్లీ ముందు నువ్వెంత, నీ బతుకెంత అంటూ అతనిపై ధ్వజమెత్తారు. నువ్వు కోహ్లీతో గొడవ పెట్టుకోకుండా ఉండాల్సిందని.. సలహాలు ఇస్తున్నారు.
VRO Job Fraud: ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు వీఆర్వో టోకరా.. లక్షల్లో వసూలు
కాగా.. ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్, నవీన్ మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకున్నారు. ఈ విషయంలో కోహ్లి సైలెంట్ అయినా.. నవీన్ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాడు. దీనికి ప్రతిగా కోహ్లి ఆర్మీ సైతం నవీన్‌లపై ఎదురుదాడి చేస్తోంది.