జాతీయ స్థాయి మహిళా యువ షూటర్ కొనికా లాయక్ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్న స్థితిలో కొనికా లాయక్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో భారత క్రీడా రంగంలో విషాదం నెలకొంది. అయితే తాను ఇష్టపడి ఎంచుకున్న షూటింగ్ క్రీడలో రాణించలేకపోవడం వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కొనికా లాయక్ ఓ సూసైడ్‌నోట్ రాసిందని పోలీసులు చెప్తున్నారు. హాస్టల్ గదిలోనే ఈ సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు.
Read Also: భారీగా పెరిగిన ప్రపంచం అప్పులు
కాగా కొనికా లాయక్ మృతిపై తాము విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని.. కావున కొనికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. గతంలో కొనికా లాయక్ తాను షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని నటుడు సోనూసూద్‌ను ట్యాగ్ చేసింది. దీంతో సోనూసూద్ వెంటనే స్పందించి కొనికాకు ఓ జర్మన్ రైఫిల్‌ను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
