ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్-2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఒకవేళ టోర్నీని పాక్‌లో జరిపితే టీమిండియా అక్కడికు వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్ జై షా స్పష్టం చేశారు. టోర్నీ వేదికను మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. దీనిపై నాటి పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా కూడా స్పందిస్తూ.. పాక్‌లో టీమిండియా ఆడకపోతే, ప్రపంచకప్‌లో పాక్ ఆడదని కౌంటర్ ఇచ్చాడు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇటీవలే రమీజ్ రాజా పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగగా ప్రస్తుతం ఛైర్మన్‌గా నజామ్ సేథీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ విషయమై జై షాతో తప్పకుండా భేటీ అవుతానని ఇప్పటికే ప్రకటించారు. ఏసీసీ మీటింగ్ సమయంలో జై షాతో ప్రత్యేకంగా సమావేశమవుతానని సేథీ వెల్లడించారు.
Mass Maharaja Raviteja: ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
“ఆసియా కప్ కౌన్సిల్ అధికారులను కలిసే సమయం వచ్చింది. ఫిబ్రవరి 4వ తేదీన బహ్రెయిన్ వేదికగా ఏసీసీ మీటింగ్ జరగనుంది. ప్రస్తుతం మా బోర్డు వైఖరిని తెలియజేసేందుకు ఇదొక అవకాశం. ఇది పాకిస్థాన్ క్రికెట్‌కు సాయపడుతుందని భావిస్తున్నా. భారత్‌లో పాకిస్తా్న్ పర్యటించాలని బీసీసీఐ కోరుకుంటుంది. కానీ పాక్‌లో ఆడేందుకు మాత్రం అంగీకరించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు మాకు కొత్తేమీకాదు. దీనిపై తప్పకుండా మాట్లాడతా” అని నజామ్ సేథీ తెలిపారు.