NTV Telugu Site icon

ఐపీఎల్‌ వేదికల జాబితా నుంచి ముంబై ఔట్‌…!

ఐపీఎల్‌ జరగబోయే వేదికల జాబితా నుంచి బీసీసీఐ ముంబైని తొలగించినట్టు తెలుస్తోంది. అక్కడ మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో… బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర బయటే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ముంబై లేకుండా తొలిసారి.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించినట్టవుతుంది. ఇక, ముంబై ప్లేస్‌ లో హైదరాబాద్‌కు ఐపీఎల్‌ వేదికల జాబితాలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఐపీఎల్‌ నిర్వహణ తేదీలపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. టోర్నీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది.ఏప్రిల్‌ 8 నుంచి 12 మధ్య ఈ మెగా టోర్నీ ప్రారంభమయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.