Site icon NTV Telugu

IPL 2022: ముంబై టీమ్ చెత్త రికార్డు.. వరుసగా పదో సారి..!!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో వరుసగా 10 సార్లు టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఓడిన రికార్డును ముంబై జట్టు మూటగట్టుకుంది.

అయితే ఈరోజు జరిగిన మ్యాచ్‌లో విజ‌యం ఖాయం అనుకున్న దశలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అనూహ్యంగా చెల‌రేగింది. 178 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో 72 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన ద‌శ నుంచి అద్భుతంగా పుంజుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో 10 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌య‌కేత‌నం ఎగుర వేసింది. ల‌లిత్ యాద‌వ్ (48), అక్షర్ ప‌టేల్ (38), శార్దూల్ ఠాకూర్ (22) ఆ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

https://ntvtelugu.com/swiss-open-badminton-winner-is-pv-sindhu/
Exit mobile version