Site icon NTV Telugu

MI vs RCB: లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ముంబై.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Mi 10 Overs Score

Mi 10 Overs Score

Mumbai Indians Scored 99 Runs In First 10 Overs Against RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న దూకుడే కొనసాగిస్తే.. ముంబై జట్టు లక్ష్యాన్ని ఛేధించగలదు. అలా జరగకుండా ఉండాలంటే.. ఆర్సీబీకి కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. బ్యాటర్లను కట్టడి చేస్తూ.. వికెట్లు తీస్తూ ఉండాలి. ఇంకా గ్రీన్, టిమ్ డేవిడ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కూడా ఉన్నారు కాబట్టి.. ఆర్సీబీ బౌలర్లు చాలా జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. కాస్త తేడా కొడితే మాత్రం.. ముంబై విజయాన్ని ఎగరేసుకు పోతుంది.

Asia Cup 2023: పాకిస్తాన్‌కి షాక్.. పంతం నెగ్గిన భారత్

తొలుత ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన ఇషాన్, రోహిత్ శర్మ.. తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. రోహిత్ శర్మ ఖాతా తెరవలేదు కానీ.. ఇషాన్ కిషన్ మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కి వీళ్లిద్దరు 51 పరుగుల భాగస్వామ్యం జోడించగా.. అందులో 42 పరుగుల ఇషాన్‌వే. దీన్ని బట్టి అతడు ఏ రేంజ్‌లో చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ప్రతి బౌలర్‌లోనూ అతడు బౌండరీల మోత మోగించాడు. పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. మొత్తం 24 బంతులు ఆడిన అతగాడు.. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. అయితే.. ఆ ఊపులోనే అతడు ఔట్ అయ్యాడు. అనవసరమైన బంతికి టెంప్ట్ అయ్యి, వనిందు హసరంగ బౌలింగ్‌లో కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్‌లో రోహిత్ శర్మ సైతం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ పోయాక క్రీజులోకి వచ్చిన నేహాల్, సూర్య.. చాలా చాకచక్యంగా రాణిస్తున్నారు. ఆచితూచి ఆడుతూనే.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Exit mobile version