Mumbai Indians Scored 58 Runs In First 10 Overs: గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి పది ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు.. కేవలం 58 పరుగులే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో ముంబై ఇంకా 150 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంతా భారీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. ముంబై బ్యాటర్లు మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఓవర్‌కి 15 రన్ రేట్ చొప్పున పరుగుల వర్షం కురిపించాల్సి ఉంటుంది. సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. మైదానంలో బౌండరీల సునామీ సృష్టించాలి. మరి.. ముంబైకి అది సాధ్యం అవుతుందా? ప్రస్తుతం క్రీజులో కెమరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వీళ్లిద్దరు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగలరు కానీ.. ఇలాంటి ఒత్తిడి సమయాల్లో నెట్టుకురావడమన్నది చాలా కష్టం. ఇది కత్తి మీద సాము వంటిదే!
Naredra Modi: మోడీజీ, పాకిస్తాన్‌ని దత్తత తీసుకోండి.. పాక్ బ్లాగర్ రిక్వెస్ట్
నిజానికి.. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చాలా కసిగా మైదానంలో దిగడం చూసి.. ఓవర్ ప్లేలో వీళ్లిద్దరూ మెరుపులు మెరిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఇద్దరూ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడారు. బంతులను వృధా చేశారు. రోహిత్ 8 బంతులు ఆడి, కేవలం 2 పరుగులే చేసి, హార్దిక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌తో కలిసి కెమరాన్ గ్రీన్ రెండో వికెట్‌కి కాస్త భాగస్వామ్యం జోడించాడు. ఇషాన్ కిషన్ చాలాసేపు క్రీజులో ఉండటంతో.. ఇక కుదురుకున్నాడని అనుకున్నారు. కానీ.. అతడు కూడా ఒత్తిడిలో అనవసరమైన షాట్ ఆడి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ కూడా పెవిలియన్ బాట పట్టాడు. రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. గ్రీన్ (26 బంతుల్లో 33) ఒక్కడే మెరుగ్గా రాణిస్తూ.. జట్టును ముందుకు నడిపిస్తూ వచ్చాడు. కానీ.. దురదృష్టవశాత్తూ అతడు 11వ ఓవర్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చూస్తుంటే.. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో ఓడిపోయేలా కనిపిస్తోంది.
Off The Record: టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు..! దువ్వాడ గెలుస్తాడా..?
