Mumbai Indians Creates Worst Record In IPL 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్ అత్యంత ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే! గుజరాత్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. కేవలం 152 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 55 పరుగుల తేడాతో ముంబై చిత్తుచిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే ముంబై జట్టు తన పేరిట ఒక చెత్త రికార్డ్‌ని లిఖించుకుంది. 2017 తర్వాత అత్యంత భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇదే సమయంలో ముంబై మరో చెత్త రికార్డ్‌ని సైతం నమోదు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో 30 కంటే తక్కువ స్కోర్ చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసిన ముంబై.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ నష్టానికి 29 స్కోరు చేసింది. అలాగే.. గుజరాత్ జట్టు కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఐపీఎల్‌లో తమ అత్యధిక టీమ్ స్కోర్‌ని (207/6) నమోదు చేసింది.
Crime News: వివాహిత శ్వేత మృతి కేసులో ట్విస్ట్.. కీలకంగా మారనున్న కాల్ రికార్డింగ్స్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ముదులిపేసింది. అన్ని విభాగాల్లో ఆ జట్టు సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌లో.. శుభ్‌మన్ గిల్ (34 బంతుల్లో 56) అర్థశతకంతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 46), అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 42), రాహుల్ తెవాటియా (5 బంతుల్లో 20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బౌలింగ్‌లో నూర్ అహ్మద్ (4-0-37-3), రషీద్ ఖాన్ (4-0-27-2), మోహిత్ శర్మ (4-0-38-2), హార్ధిక్ పాండ్యా (2-0-10-1) సత్తా చాటి, తమ జట్టుని గెలిపించుకున్నారు. ముంబై జట్టు గురించి మాట్లాడితే.. మొదట్లో ముంబై బౌలర్లు గుజరాత్‌ని కట్టడి చేశారు కానీ, చివర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్‌లోనూ ముంబై జట్టు చేతులెత్తేసింది. నేహాల్ వధేరా (21 బంతుల్లో 40), గ్రీన్ (33) పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు దారుణంగా దారుణంగా విఫలమయ్యారు.