Mumbai Indians Batting Innings Completed Against RCB: ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ విజృంభణతోనే ముంబై జట్టు ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఐదో స్థానంలో వచ్చిన ఈ ఆటగాడు.. ఆచితూచి ఆడుతూనే, బంతులు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. తిలక్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చాలా కూల్‌గా తన ఇన్నింగ్స్ కొనసాగించాడు. 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సహకారంతో 84 పరుగులు సాధించాడు. ఒంటరి పోరాటం చేస్తూ.. తన జట్టుకి మంచి స్కోరుని అందించాడు.
Donald Trump: కేసులు ఉన్నా తగ్గని ఆదరణ.. ట్రంపుకు ఒకే రోజు భారీ విరాళం..
నిజానికి.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడం, అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లందరూ చేతులెత్తేయడం చూసి, ముంబై జట్టు 120 పరుగుల మార్క్‌ని అందుకోవడం కూడా కష్టమేనని అనిపించింది. మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులే చేయడంతో.. ఇక ముంబై పని అయిపోయినట్టేనని అంతా ఫిక్స్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి హేమాహేమీలే వికెట్లు కోల్పోవడంతో.. స్వల్ప స్కోరుకే ముంబై చాపచుట్టేస్తుందని భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని తిలక్ వర్మ తిప్పికొట్టాడు. ముంబై జట్టుకి తానున్నానంటూ.. ఒంటరి పోరు సాగించాడు. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్‌ని స్టార్ ప్లేయర్లు ఎదుర్కోలేకపోతే.. ఇతడు మాత్రం తాండవం చేశాడు. అనవసరమైన టెంప్టింగ్ షాట్ల జోలికి వెళ్లకుండా.. ఎంతో శ్రద్ధగా పరుగుల వర్షం కురిపించాడు. అతడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు.. ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, కానీ ఈ వీడు మాత్రం శ్రద్ధగా, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టుగా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు. నిజంగా ఈ మ్యాచ్‌కి మాత్రం వీడు మగాడ్రా బుజ్జి.
China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. కరణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లే, ఆకాశ్, హర్షల్, బ్రేవ్‌వెల్ తలా వికెట్ తీసుకున్నారు. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన ఆర్సీబీ.. చివర్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. యువ ఆటగాళ్లే కదా.. ఏం కొడతారులే అని లైట్ తీసుకున్నారో ఏమో గానీ.. చివర్లో మాత్రం వీళ్లు తేలిపోయారు. సిరాజ్ అయితే 19వ ఓవర్‌లో వైడ్‌ల వర్షం కురిపించాడు. ఇక చివరి బంతికి హెలికాప్టర్ షాట్‌తో సిక్స్ కొట్టి, తిలక్ ముగించిన తీరు మాత్రం.. ఈ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పుకోవాలి.