Site icon NTV Telugu

MS Dhoni: సుప్రీంకోర్టులో ధోనీ పిటిషన్.. ఎందుకంటే..?

Dhoni

Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే అంశంలో గతంలో కూడా ధోనీ కోర్టు మెట్లెక్కాడు. ఆమ్రపాలితో నడుస్తున్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ధోనీ త‌న పిటిష‌న్‌లో అభ్యర్థించాడు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు మే 6న విచార‌ణ చేప‌ట్టనున్నట్లు ప్రక‌టించింది.

2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికం మొత్తాన్ని సదరు కంపెనీ ఎగ్గొట్టిందని గతంలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే మరోసారి సదరు సంస్థతో నెలకొన్న వివాదంలో మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ధోనీ కోరాడు. మరి ధోనీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో మే 6 వరకు వేచి చూడాల్సిందే.

IPL 2022: హర్భజన్ ఆల్‌టైం ఐపీఎల్ జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?

Exit mobile version