ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ తమ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. హోంగ్రౌండ్ లో తమకు ఓడించడం అంత సులువు కాదని సీఎస్కే మరోసారి నిరూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ సీఎస్కే బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. డెవాన్ కాన్వే 77 పరుగులు నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించాడు.
Also Read : CSK vs SRH : హైదరాబాద్‌పై చెన్నై విజయం.. మళ్లీ బొల్తా కొట్టిన సన్ రైజర్స్
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాళ్లను కలిశాడు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ వర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంతసేపే ధోని అవతలి జట్టును, ఆటగాళ్లను ప్రత్యర్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసిందంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు.
Also Read : Kunamneni Sambasiva Rao : బీజేపీ లేక ముందే రాముడు ఉన్నాడు
అయితే గతంలోనూ ధోని ప్రత్యర్థి జట్ల ఆటాళ్లకు సలహాలు ఇవ్వడం చూశాం.. తాజాగా ఎస్ ఆర్ హెచ్ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన అభిమానులు.. ధోని సలహాలతోనైన ఎస్ ఆర్ హెచ్ లో మార్పు వస్తుందేమో చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆరు మ్యాచ్ ల్లో రెండు గెలిచిన ఎస్ ఆర్ హెచ్ కు ఇది హ్యాట్రిక్ పరాయజం.