ఇండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అభిమానులను కలవడం, స్నేహితులకు సంబందించిన ఈవెంట్స్ లలో పాల్గొంటు సందడి చేస్తున్నాడు.. తాజాగా తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలో ధోని సందడి చేశాడు.. అందుకు సంబందించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో అతను ఆ వ్యక్తి పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకోవడమే కాకుండా అతని ముఖానికి కేక్ పెట్టడం కూడా చూపిస్తుంది.. ఈ వీడియోను సుమీత్ కుమార్ బజాజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో గది మొత్తం బెలూన్‌లతో అలంకరించబడి, టేబుల్‌పై ఉంచిన రెండు కేకులను చూపిస్తూ మొదలవుతుంది. ఓ వ్యక్తి కేక్ కట్ చేయడానికి ముందుకు సాగిన క్షణంతో పాటు పుట్టినరోజు పాటను ఆనందంగా పాడే వ్యక్తుల సమూహంతో స్థలం ఉల్లాసంగా ఉంటుంది. MS ధోనీ కేక్ ను తినిపించిన తర్వాత, ముఖానికి కేక్ పూయడం చేస్తాడు ధోని.. దానికి అందరు నవ్వుతారు.. ఫన్నీగా ఉంటుంది
ఈ వీడియో రెండు రోజుల క్రితం షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇది ఎనిమిది లక్షలకు పైగా వీక్షణలను మరియు 72,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.. ఈ వీడియో ను చూసిన ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. అలాగే నెటిజన్లు గ్రేట్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..