Site icon NTV Telugu

Most Valuable Actors: నంబర్ వన్‌గా ప్రభాస్ ‘రాజు’.. టాప్-10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ ఇదే!

Most Valuable Indian Actor Prabhas

Most Valuable Indian Actor Prabhas

భారత సినిమా పరిశ్రమ రోజురోజుకీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ విలువ కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన నటుల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలతో సంపాదించిన క్రేజ్.. ప్రభాస్‌ను ఈ లిస్టులో నంబర్ వన్‌గా నిలబెట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ విలువ సుమారు రూ.7,132 కోట్లుగా అంచనా వేయబడింది. ‘బాహుబలి’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాలు అతడిని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా స్టార్‌గా మార్చాయి. పాన్ ఇండియా ట్రెండ్‌కు నిజమైన నిర్వచనంగా ప్రభాస్ నిలిచాడనే చెప్పాలి.

రెండో స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఉన్నారు. సుమారు రూ.4,124 కోట్ల విలువతో షారుఖ్ ఇప్పటికీ బాలీవుడ్‌కు పెద్ద బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఆయన మార్కెట్ మరింత బలపడింది. మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ (రూ.3,987 కోట్లు), నాలుగో స్థానంలో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (రూ.3,871 కోట్లు) నిలిచారు. దక్షిణాది నుంచి మరో లెజెండరీ నటుడు రజనీకాంత్ ఐదో స్థానంలో ఉన్నారు. రూ.3,115 కోట్ల విలువతో రజనీ ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఐకాన్‌గా కొనసాగుతున్నారు. ఆరో స్థానంలో బాలీవుడ్ యంగ్ స్టార్ రణవీర్ సింగ్ (రూ.2,913 కోట్లు) ఉన్నారు.

Also Read: Gautam Gambhir: వెరీ వెరీ స్పెషల్ రెడీ.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఉండడా?

టాలీవుడ్ నుంచి మరో స్టార్ అల్లు అర్జున్ ఏడో స్థానంలో నిలవడం విశేషం. ‘పుష్ప’ సినిమాతో నేషనల్ లెవల్ క్రేజ్ సంపాదించిన బన్నీ మార్కెట్ విలువ రూ.2,892 కోట్లుగా ఉంది. ఎనిమిదో స్థానంలో అక్షయ్ కుమార్ (రూ.2,531 కోట్లు) ఉండగా, తొమ్మిదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ (రూ.2,331 కోట్లు) ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. పదో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. రూ.2,130.74 కోట్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ విజయం తర్వాత చరణ్ గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందారు. ఈ జాబితా చూస్తే.. టాలీవుడ్ హీరోలు దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో దక్షిణాది నటుల మార్కెట్ విలువ భారీగా పెరిగిందని ఈ టాప్ 10 లిస్ట్ స్పష్టంగా చెబుతోంది.

Exit mobile version