Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
- టీజీ20 క్రికెట్ లీగ్ 2026 వేలం
- మహ్మద్ సిరాజ్‌ను కైవసం చేసుకున్న వరంగల్
- దూకుడుగా వ్యవహరిస్తున్న వరంగల్ వారియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Joins Warangal Warriors: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు భారీ ధర పలికింది. వరంగల్ వారియర్స్ ఫ్రాంఛైజీ అతడిని రూ.14 లక్షలకు సొంతం చేసుకుంది. సిరాజ్ ఎంపికతో వరంగల్ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
వరంగల్ వారియర్స్ వేలంలో దూకుడుగా వ్యవహరిస్తూ పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. రిషికేత్ సిసోదియాను రూ.4.75 లక్షలకు కొనుగోలు చేసిన ఈ ఫ్రాంఛైజీ.. హర్షిత్ చౌదరిని రూ.3 లక్షలకు దక్కించుకుంది. అలాగే భావేశ్ను రూ.5 లక్షలకు జట్టులోకి తీసుకుని తమ స్క్వాడ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు మహ్మద్ అబ్దుల్ మాలిక్‌ను కూడా రూ.3 లక్షలకు సొంతం చేసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లపై వరంగల్ వారియర్స్ దృష్టి పెట్టింది.
Also Read
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
- Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
- KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
ఎ ప్లస్ కేటగిరీలో ఉన్న అమన్ రావుకు వేలంలో మంచి ధర పలికింది. అతడిని వరంగల్ వారియర్స్ రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో వరంగల్ జట్టు వేలంలో అత్యంత చురుకైన ఫ్రాంఛైజీలలో ఒకటిగా నిలిచింది. యువ ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తున్న టీజీ20 లీగ్ వేలంలో ఇంకా పలువురు ఆటగాళ్లపై ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టీజీ20 లీగ్ జూన్ 20 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జూలై 11న ఫైనల్‌తో టోర్నీ ముగియనుండగా.. రాష్ట్ర యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదికగా ఈ లీగ్ నిలవనుంది.
తాజావార్తలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!