NTV Telugu Site icon

Team India: టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్‌ టూర్‌కు స్టార్ బౌలర్ దూరం

Shami

Shami

Team India: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. చేతి గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. అతడికి దాదాపు రెండు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల నుంచి షమీ తప్పుకున్నట్లు పీటీఐ వెల్లడించింది.

Read Also: Andhra Pradesh: టీవీ చూస్తున్న భార్య.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త

బంగ్లాదేశ్‌ పర్యటనకు సన్నాహాకాల్లో భాగంగా ప్రాక్టీస్‌ సెషన్‌లో షమీ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నాడు. షమీ భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌కు వెళ్లలేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా దూరం కాగా.. తాజాగా సీనియర్‌ పేసర్‌ షమీ గాయం బారిన పడడం జట్టు మేనేజేమెంట్‌ను కలవరపెడుతోంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు షమీ దూరం కావడం భారత జట్టుకు ఎదురుదెబ్బేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసులో నిలవాలంటే టీమిండియా ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలి. కాబట్టి షమీ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు జట్టులో ఉండాలి. బుమ్రా, షమీ లేకపోవడంతో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, కుల్దీప్ సేన్ వంటి ఆటగాళ్లపైనే టీమిండియా ఆధారపడాలి.

Show comments