Site icon NTV Telugu

బుమ్రాతో ఆ పాక్ బౌలర్ ను పోల్చడం అవివేకం…

భారత పేసర్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని.. అతడిని పాకిస్థాన్ యువ బౌలర్ షాహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే అఫ్రిది మరియు బుమ్రా ఇద్దరూ తమ జట్లలో కీలకమైన బౌలర్లు. కానీ ఇంకా షాహీన్ చిన్నవాడు కనుక తనను ఇప్పుడే బుమ్రాతో పోల్చడం అవివేకం. షాహీన్ ఇంకా నేర్చుకుంటున్నాడు. కానీ బుమ్రా కొంతకాలంగా భారత జట్టు తరపున దఃబుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను ప్రస్తుతం ఓ అత్యుత్తమ టీ 20 బౌలర్ అని నేను అనుకుంటున్నాను.. అది కూడా ముఖ్యంగా డెత్ ఓవర్లలో” అమీర్ అన్నారు. అలాగే భారతదేశం కంటే పాకిస్తాన్‌కు మెరుగైన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉందని అమీర్ అభిప్రాయపడ్డాడు, అయితే కోహ్లి జట్టులో అత్యుత్తమ స్పిన్ అటాక్ ఉందని
అమీర్ చెప్పాడు. చూడాలి మరి రేపు ఈ రేంజు జట్లు తలపడే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Exit mobile version