Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Santner About Rohit-Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు విఫలమవడమే ఇందుకు కారణం. 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 30 పరుగులే చేసిన రోహిత్.. 7.50 సగటుతో సిరీస్‌ను ముగించాడు. సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. 4 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 21.5 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఐదవ వన్డే అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. న్యూజిలాండ్‌లో రోహిత్, కోహ్లీ జంటను చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారన్నాడు.
న్యూజిలాండ్‌లో ఇదే చివరిసారి కావొచ్చు:
భారత్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో ఆడిన అనుభవం గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా మిచెల్ శాంట్నర్ ఆసక్తికరంగా స్పందించాడు. సిరీస్ మొత్తం అభిమానుల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని, చాలా మ్యాచ్‌ల్లో తాము సొంతగడ్డపై కాకుండా ప్రత్యర్థి జట్టుకు మద్దతు లభించే మైదానాల్లో ఆడుతున్నట్లు అనిపించిందని చెప్పాడు. ‘రో-కోను న్యూజిలాండ్‌లో చివరిసారిగా చూడటానికి అభిమానులు వచ్చి ఉండొచ్చు. వారితో ఆడటం ఇప్పటికీ ఎంతో బాగుంటుంది. న్యూజిలాండ్‌లో మ్యాచ్‌లు జరిగినప్పటికీ, ప్రేక్షకులు భారత్‌కు మద్దతు ఇవ్వడంతో మేము దాదాపు అన్ని మ్యాచ్‌లను ప్రత్యర్థి గడ్డపైనే ఆడుతున్నట్లు అనిపించింది. అయినప్పటికీ పూర్తిగా నిండిన స్టేడియాల్లో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే’ అని శాంట్నర్ వ్యాఖ్యానించాడు.
Also Read
- India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
- IND vs NZ: తక్కువ స్కోరుతోనే టీమిండియా సంచలనం.. 46 ఏళ్ల రికార్డు జాబితాలో భారత్!
- Arshdeep Singh: నేను బంతికి భయపడతా అంటారు.. కానీ ఎలా ఆడనో చూశారు కదా!
- Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
ఐదో వన్డేలో భారత్ విజయం.. సిరీస్ కైవసం:
న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. బే ఓవల్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 187 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌పై సిరీస్ గెలవడం టీమిండియాకు సానుకూలంగా నిలిచింది. అయితే భారత బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.
కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్‌లో నిరాశ:
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. తొలి వన్డేలో కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేసి మంచి ఆరంభం అందించినప్పటికీ.. మిగతా మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ సిరీస్‌ను 21.5 సగటుతో ముగించాడు. 2014 తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో కోహ్లీకి ఇది రెండో అత్యల్ప బ్యాటింగ్ సగటుగా నిలిచింది. మరోవైపు రోహిత్ ప్రదర్శన మరింత నిరాశపరిచింది. 39 ఏళ్ల ఈ ఓపెనర్ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కేవలం 7.5 సగటుతో పరుగులు చేశాడు. వన్డేల్లో భారత్ తరఫున అతడికి నమోదైన రెండో అత్యల్ప సగటు ఇదే. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అంతర్జాతీయ కెరీర్‌పై అభిమానుల్లో చర్చలు కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి.
తాజావార్తలు
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
RBI Loan Rules: చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మైక్రోఫైనాన్స్ లోన్ నిబంధనలను మార్చనున్న RBI?
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Box Office Clash: టాప్ హీరోయిన్స్ మధ్య వార్.. స్టార్ బ్యూటీల్లో గెలిచేదెవరు?
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్..!
ట్రెండింగ్
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..