NTV Telugu Site icon

Social Media: గోల్డెన్ గుడ్డు రికార్డు పాయె.. ఇన్‌స్టాను షేక్ చేస్తున్న మెస్సీ ఫోటో

Instagram

Instagram

Social Media: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. దీంతో ఎక్కడ చూసినా లైక్, షేర్, కామెంట్ అనే మాట వినిపిస్తోంది. ఈ పేరుతో ఇప్పటికే సినిమా కూడా వచ్చేసిందంటే ఈ పేర్లకు ఉన్న మేనియా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అట్టర్‌ఫ్లాప్ సినిమాలోని ‘జంబలకిడి జారు మిఠాయ’ సాంగ్‌ను ట్రెండ్ సెట్టర్‌గా మార్చాలన్నా.. ఓ గుడ్డు ఫోటోకు వరల్డ్ రికార్డు కట్టబెట్టాలన్నా కేవలం సోషల్ మీడియా వల్లే సాధ్యం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అర్జెంటీనాకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ సాధించిపెట్టిన స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో రికార్డులు సృష్టిస్తోంది.

Read Also: Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా?

ఫిఫా వరల్డ్ కప్ 2022 గెలిచిన తర్వాత ట్రోఫీతో కలిసి దిగిన ఫోటోను లియోనల్ మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు మూడు రోజుల్లో 68 మిలియన్ల లైకులు వచ్చేశాయి. గతంలో బంగారు వర్ణంలో ఓ గుడ్డును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే ఆ ఫోటోకు 57 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇన్‌స్టా ప్రపంచంలో అత్యధిక లైకులు పొందిన పోస్టుగా ఈ ఫోటో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. మూడేళ్లు ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే ప్రస్తుతం మెస్సీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 68 మిలియన్ లైకులతో మెస్సీ తన ప్రపంచకప్ ట్రోఫీ ఫోటోతో గుడ్డు రికార్డును పగలకొట్టేశాడు. కాగా ఆదివారం జ‌రిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జ‌ట్టుపై షూటౌట్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. అంతేకాకుండా బెస్ట్ ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీకి ఇచ్చే గోల్డెన్ బాల్‌ అవార్డును కూడా మెస్సీ గెలుచుకున్నాడు.