Site icon NTV Telugu

Australia: క్రికెట్‌లో కొత్త నిబంధనలు.. మన్కడింగ్‌పై నిషేధం

క్రికెట్‌లో మన్కడింగ్ పలు మార్లు ఎలాంటి వివాదాలను సృష్టించిందో గతంలో ఎన్నో సార్లు చూశాం. బౌలర్ బంతి వేసే సమయంలో నాన్ స్ట్రైకర్ ముందే క్రీజు దాటితే బౌలర్ అవుట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారు. అయితే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ అసోసియేషన్ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వివాదాలకు కారణమయ్యే మన్కడింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది.

బౌలింగ్ స‌మ‌యంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఆటగాడు ప‌రుగు కోసం సిద్ధంగా ఉండాలి కాబ‌ట్టి అందులో భాగంగానే క్రీజు దాటే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. అలాంటి స‌మ‌యంలో మ‌న్కడింగ్ పేరుతో బౌల‌ర్ ఆటగాడిని ఔట్ చేయ‌డం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమ‌ని ఎంసీసీ అభిప్రాయ‌ప‌డింది. మరోవైపు క్యాచ్ అవుట్ సమయంలో స్ట్రైకింగ్ విషయంలో మార్పులు చేసింది.

ఆటగాడు క్యాచ్ ఇచ్చిన‌ప్పుడు ఆ క్యాచ్‌ను ఫీల్డర్ అందుకునే లోపే క్రీజులో ఉన్న ఆటగాళ్లు ప‌రుగు కోసం వెళ్లిన క్రమంలో ఒక‌రినొక‌రు దాటినట్లయితే.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాట‌ర్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌వైపు ఉండాలని రూల్ తీసుకొచ్చింది. గ‌తంలో ఉన్న రూల్ ప్రకారం ఇలాంటి స‌మ‌యాల్లో క్రీజులోకి వ‌చ్చే కొత్త బ్యాట‌ర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు వైపు ఉండేవాడు.

Exit mobile version