ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుక్రవారం నాడు తన గర్ల్‌ఫ్రెండ్, భారతీయ యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా మ్యాక్స్‌వెల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
కాగా మ్యాక్స్‌వెల్-వినీ రామన్ జంటకు ఆస్ట్రేలియా క్రికెటర్లు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మ్యాక్సీ, వినీ రామన్ వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా శాంతి, సౌభాగ్య, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. కాగా గ్లెన్ మాక్స్‌వెల్, వినీరామన్ ప్రేమకు ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవడంతో వారి పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. వినీరామన్ తమిళనాడు సంతతి యువతి కాబట్టి తమ తమిళంలో ప్రింట్ చేసిన పెళ్లి పత్రికను కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో మ్యాక్స్‌వెల్ జంట అభిమానులతో పంచుకుంది.
