Site icon NTV Telugu

Team India: వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్- కోహ్లీని ఆడించకపోవడం మంచిది కాదు..

Roko

Roko

Team India: టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వన్డే వరల్డ్‌ కప్‌ 2027లో ఆడించాలి.. లేకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుందని మాజీ క్రికెటర్ మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. అలాగే, గౌతమ్‌ గంభీర్‌ కోచ్‌గా వచ్చినప్పటి నుంచే జట్టుకు సీనియర్‌ ప్లేయర్స్ దూరం అవుతున్నారు.. తన నిర్ణయాలకు అడ్డు రావడంతోనే గంభీర్‌.. అశ్విన్‌, రోహిత్‌, విరాట్‌ను జట్టులో లేకుండా చేశాడని తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.

Read Also: Vizianagaram: పైడితల్లి అమ్మవారి దర్శనాల్లో వీఐపీలకే అధిక ప్రాధాన్యతపై భక్తుల్లో ఆగ్రహం

ఇక, గత ఏడాది భారత్‌- ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అలాగే, రోహిత్‌, కోహ్లీ సైతం 2025 మేలో ఒకరి తర్వాత మరొకరు టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. వీరిద్దరూ ఇంతకు ముందే టీ20లకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఒకవేళ జట్టులో సీనియర్‌ ప్లేయర్స్ అశ్విన్‌, రోహిత్‌, కోహ్లీ ఉంటే.. కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తీసుకున్న ఏ నిర్ణయాన్ని తమకు నచ్చకుంటే వారు ప్రశ్నించే ఛాన్స్ ఉంది అని మనోజ్ తివారీ పేర్కొన్నారు. వాళ్లు లేకపోతే ఎలాంటి సమస్య ఉండదు కదా.. గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌కోచ్‌గా వచ్చినప్పటి నుంచి చాలా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇది భారత క్రికెట్‌కు అంత మంచిది కాదు అన్నాడు. గంభీర్‌ కోచ్‌గా వచ్చిన తర్వాతే స్టార్ ప్లేయర్స్ ఊహించని విధంగా రిటైర్మెంట్లు ప్రకటించారు. దీంతో పలువురు ఆటగాళ్లు స్వ్కాడ్‌లోకి, ఆ తర్వాత నేరుగా తుది జట్టులోకి వచ్చేస్తున్నారు. తివారీ ఆరోపించాడు.

Read Also: Dhanush : సినిమా రిలీజయి నెల కాకముందే.. ఓటీటీలోకి ధనుష్ హిట్ మూవీ

అయితే, రోహిత్‌, విరాట్‌ కోహ్లీ టీమిండియా కోసం ఎంతో చేశారు అని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తెలిపారు. కానీ, ప్రస్తుతం వారిని గంభీర్ ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒకవేళ వారిద్దరినీ వన్డే వరల్డ్‌ కప్‌ 2027లో కోచ్‌ ఆడించకుంటే.. అది పెద్ద తప్పిదమే అన్నారు. తమ గౌరవానికి భంగం కలుగుతోందని భావిస్తే రోహిత్‌, విరాట్‌.. డ్రెస్సింగ్‌ రూంలో ఉండటానికి అస్సలు ఇష్టపడరు.. బహుశా వారు రిటైర్‌మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ అలా జరగొద్దు, వారు ఇంకా క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నా.. గంభీర్ కూడా ఈ విషయంలో వెనకడుగు వేస్తాడు.. ఎందుకంటే వైట్‌ బాల్‌ క్రికెట్‌లో రో- కో అద్భుతమైన ఆటగాళ్లని మనోజ్‌ తివారీ చెప్పుకొచ్చారు.

Exit mobile version