మీరాబాయి చానుకు అరుదైన గౌరవం..

Mirabai

Mirabai

కట్టెలు ఎత్తిన చేతులతోనే భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టారు వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి.. భారత్‌ పతకాల ఖాతా తెరిచారామె.. ఇక, ఆమెకు బంగారం పతకం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.. కానీ, బంగారు పతకాన్ని అందుకున్న చైనీ క్రీడాకారిణి డోపింగ్‌ టెస్ట్‌లో విఫలం అయితేనే అదిసాధ్యం అవుతుంది. మరోవైపు.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న చానుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.. ఇక, ఇటీవల ఆమెకు కోటి రూపాయల రివార్డు ప్రకటించిన మణిపూర్‌ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.. మీరాబాయి చానును అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ఎన్. బీరెన్ సింగ్ వెల్లడించారు. అలాగే జూడో క్రీడాకారిణి లిక్మాబమ్ సుశీల దేవిని కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోట్ చేయనున్నట్టు.. ఒలిపింక్స్‌లో పాలుపంచుకున్నందుకు గాను రూ. 25 లక్షల రివార్డు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు మణిపూర్‌ సీఎం.