Mahendra Singh Dhoni: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ నెల 25న సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లోకి వచ్చి సర్‌ప్రైజ్‌ను ధోనీ రివీల్ చేయనున్నాడు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్‌గా ఉంటాడు. చాలా అరుదుగా పోస్టులు చేస్తుంటాడు. అయితే ఫేస్‌బుక్‌లో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెట్టి అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న లైవ్‌లో ఓ సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి అభిమానులను సందేహంలోకి నెట్టాడు. దీంతో ఇంతకీ ధోనీ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:FNCC Elections: రేపే ఎఫ్‌ఎన్‌సిసి ఎన్నికలు
అయితే ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తాడని కొందరు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం రిటైర్మెంట్‌పై కాకుండా వేరే న్యూస్ అయి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ధోనీ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని ఐసీసీ ఈవెంట్లలో విజయం సాధించింది. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచింది. 2011లో వన్డే ప్రపంచకప్‌ను కూడా ధోనీ సారథ్యంలోనే భారత్ సాధించింది. ధోనీ నాయకుడిగా ఉన్నప్పుడే టెస్టుల్లోనూ నంబర్‌వన్‌గా అవతరించింది. అటు ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ కొనసాగుతున్నాడు.
