Site icon NTV Telugu

క్వార్టర్‌ ఫైనల్‌లో భారత బాక్సర్‌.. పతకానికి పంచ్‌ దూరమే..

Lovlina Borgohain

Lovlina Borgohain

టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకానికి పంచ్‌ దూరంలో ఉంది ఇండియా.. ఇవాళ 69 కిలోల విభాగంలో జరిగిన బాక్సింగ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ సంచలనం సృష్టించింది.. జర్మన్‌ బాక్సర్‌ నడైన్‌ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి.. క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది.. ఇక, క్వార్టర్స్‌లో గెలిస్తే.. ఆమె కనీసం కాంస్య పతకం అందుకోనుంది.. ఇవాళ భారత్‌ నుంచి పోటీపడిన ఏకైక బాక్సర్‌ లవ్లీనా మాత్రమే కాగా.. విజయం సాధించి పతకంపై ఆశలు చిగురించేలా చేసిందామే.. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె.. బలమైన ప్రత్యర్థిపై పోరాటపటిమ చూపించి స్వల్పతేడాతో గెలుపొందారు. మరోవైపు.. జర్మనీ నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి బాక్సర్‌ ఆప్టెజ్‌.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచిందామె.. ఇక లవ్లీనాకూ సైతం రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్యాలు గెలిచిన అనుభవం ఉన్నా.. ఈ ఇద్దరూ ఒలింపిక్స్‌లో ఆడడం ఇదే ఫస్ట్‌ టైం.

Exit mobile version