Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
- రెండో టీ20లో ఒక పరుగు తేడాతో ఐర్లాండ్ విజయం
- భారత్‌పై టీ20 సిరీస్ గెలిచిన ఐర్లాండ్
- టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా?
- మొదటి విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lorcan Tucker Reaction after Ireland T20 series win vs India: ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో భారత్‌ను ఓడించి.. తమది గాలివాటం ఆట కాదని నిరూపించుకుంది. ముందుగా ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఛేదనలో టీమిండియా 9 వికెట్లకు 153 పరుగులే చేసి ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఐర్లాండ్ కెప్టెన్ లోర్కన్ టక్కర్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత్ వంటి ప్రపంచ అగ్రశ్రేణి జట్టుపై వరుసగా రెండు విజయాలు సాధించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఇది తమ జట్టుకు ఎంతో ప్రత్యేకమైన ఘనత అని పేర్కొన్నాడు.
మొదటి విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించాం:
‘మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత మా ఆటగాళ్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే అది గాలివాటం విజయం కాదు. మనమేంటో ప్రపంచానికి మరోసారి నిరూపించాలని జట్టుకు సవాల్ విసిరా. మొదటి మ్యాచ్ విజయోత్సాహం నుంచి బయటకు వచ్చి.. రెండో టీ20పై దృష్టి పెట్టాం. మరోసారి అదే పట్టుదలతో బరిలోకి దిగాం. ఆటగాళ్లందరూ ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరించి మరో అద్భుత విజయాన్ని అందించారు. మా ప్లేయర్స్ బాగా ఆడారు. టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా?.. అని అనిపిస్తోంది. మా కల నిజమైన క్షణం’ అని లోర్కన్ టక్కర్ చెప్పాడు.
Also Read
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
- IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
సాధారణ క్రికెట్ ఆడితేనే విజయాలు:
‘మ్యాచ్‌ను చివరి వరకు నియంత్రణలో ఉంచగలిగాము. మంచి క్రికెట్ అంటే క్లిష్టమైన ఆట కాదు. పరిస్థితులకు అనుగుణంగా సింపుల్‌గా ఆడితేనే విజయాలు సాధించవచ్చని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పిచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేస్తే ప్రపంచంలోని అత్యుత్తమ జట్లనైనా ఓడించగలం. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం తక్కువే. అయినప్పటికీ వారు నెట్ సెషన్లలో ఎంతో కష్టపడ్డారు, ఆటపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఒత్తిడికి లొంగకుండా అద్భుత ప్రదర్శన చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టైన భారత్‌ను ఓడించాం’ అని టక్కర్ గర్వం వ్యక్తం చేశాడు.
ఐర్లాండ్ క్రికెట్‌పై అందరి దృష్టి:
అంతర్జాతీయ క్రికెట్లో తాము చాలాసార్లు వెలుగులోకి రాకుండా నీడలోనే ఉండిపోతామని టక్కర్ వ్యాఖ్యానించాడు. కానీ ఈ చారిత్రక సిరీస్ విజయంతో ఇప్పుడు ఐర్లాండ్ క్రికెట్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కడం తమ అదృష్టమని, అభిమానుల మద్దతు అద్భుతంగా ఉందని చెప్పాడు. భవిష్యత్తులో కూడా భారత్‌తో మరిన్ని సిరీస్‌లు ఆడాలని కోరుకున్నాడు.
ఐర్లాండ్ క్రికెట్‌కు స్వర్ణయుగం:
ప్రస్తుతం ఐర్లాండ్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఉండటం ఎంతో గర్వకారణమని టక్కర్ పేర్కొన్నాడు. ఇటీవల సాధిస్తున్న విజయాలు, యువ ఆటగాళ్ల ఎదుగుదల ఐర్లాండ్ క్రికెట్‌కు కొత్త దిశ చూపిస్తున్నాయని అన్నాడు. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో లేదా టీవీలో చూసిన చిన్నారులకు తాము స్ఫూర్తిగా నిలిచామని.. వారు కూడా భవిష్యత్తులో దేశం కోసం ఆడాలని కలలు కనాలని టక్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..