Site icon NTV Telugu

క్రీడాభిమానులకు శుభవార్త… అమెజాన్ ప్రైమ్‌లో క్రికెట్ లైవ్

ఇప్పటివరకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ క్రికెట్ మ్యాచ్‌లను లైవ్‌గా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారతజట్టు ప్రకటన

కాగా న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డుతో అమెజాన్ ప్రైమ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో న్యూజిలాండ్ దేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ వన్డేలు, టీ20లు, టెస్టు మ్యాచ్‌లన్నీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించినా అమెజాన్ ప్రైమ్‌లో మ్యాచ్‌లు లైవ్‌లో ప్రసారం అవుతాయి. అమెజాన్ ప్రైమ్ యూజర్లు యాప్‌తో సహా వైబ్‌సైట్, ఫైర్ టీవీ స్టిక్స్‌తో పాటు అన్ని కంపాటిబుల్ డివైజెస్‌లో క్రికెట్ లైవ్ వీక్షించే అవకాశం ఉంది.

Exit mobile version