Site icon NTV Telugu

Lionel Messi: ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక

Ziva Dhoni

Ziva Dhoni

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్ సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు అపురూప కానుకలు అందజేస్తున్నాడు. తాజాగా మెస్సీ మరోసారి భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ధోనీకి బహుమతి పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపాడు. ఈ జెర్సీని చూసి జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

Read Also: Calabash benefits: సొరకాయ తినడం మంచిదేనా?

కాగా మెస్సీకి ఎంఎస్ ధోనీ పెద్ద అభిమాని. తనకు క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమని గతంలో ధోనీ ఎన్నోసార్లు చెప్పాడు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ విష‌యం తెలిసిన అర్జెంటీనా స్టార్ త‌న జెర్సీని పంపించి ధోనీ కుటుంబీకులను స‌ర్‌ప్రైజ్ చేశాడు. రెండు రోజుల క్రితం మెస్సీ త‌న సంత‌కం ఉన్న జెర్సీని బీసీసీఐ సెక్రట‌రీ జైషాకు పంపించాడు.

Exit mobile version