సీజన్ ల వారీగా లభించే కాయగూరల్లో చాలా ఉంటాయి. కానీ మనం వాటిని గుర్తించక అశ్రద్ధ చేస్తాం.

చలికాలంలో ఎక్కువగా సొరకాయ మన కళ్లముందు కనిపిస్తుంది. 

సొరకాయ తినడం వల్ల ఎంతలాభమో తెలియక పక్కన పెట్టేస్తాము. సొరకాయలో 96% శాతం నీరు ఉంటుంది.

ఇందులో విటమిన్-సి, రైబోఫ్లోవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, వంటి పోషకాలు ఉంటాయి

తరుచూ అలసటకు గురయ్యేవారు సొరకాయ తింటే మంచిదని న్యూట్రిషన్స్ అంటున్నారు. 

100gr సొరకాయలో 1gr మాత్రమే కొవ్వు పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

బరువు తగ్గాలనుకునే వారికి కూడా సొరకాయ బాగా పనిచేస్తుంది. 

గ్యాస్ సమస్యలు, ఫైల్స్ ఉన్న వారికి వైద్యులు సొరకాయ తినమని సూచిస్తారు. 

ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఎలా తిన్నా మంచిదే.