Liam Livingstone: లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్లో 28 రన్స్
- ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఊచకోత
- మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్ స్టోన్ 28 పరుగులు
- నాలుగు సిక్సర్లు.. ఒక ఫోర్
- వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన లివింగ్ స్టోన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఊచకోత చూపించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ 28 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 39వ ఓవర్లో స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అందులో వరుసగా మూడు సిక్సర్లు కూడా ఉన్నాయి. వన్డే క్రికెట్లో ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ ఇన్ని పరుగులు సమర్పించలేదు. ఇంతకుముందు సైమన్ డేవిస్, క్రెయిగ్ మెక్‌డెర్మాట్, జేవియర్ డోహెర్టీ, ఆడమ్ జంపా, కామెరాన్ గ్రీన్ అత్యధికంగా ఒక ఓవర్లో 26 పరుగులు ఇచ్చారు.
Pure Little Hearts Foundation: ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 10 మంది గుండె జబ్బులతో జననం
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
27 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో లివింగ్‌స్టోన్ అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్లకు 312 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. బెన్ డకెట్ 62 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 63 పరుగులు, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 87 పరుగులు, జామీ స్మిత్ 28 బంతుల్లో 1 సాయంతో 39 పరుగులు చేశారు. కాగా.. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఆడమ్ జంపా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. స్టార్క్ ఎనిమిది ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హేజిల్‌వుడ్‌లకు తలో వికెట్ పడగొట్టారు.
CMR Shopping Mall: నిజామాబాద్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 24.4 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 186 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోయారు. స్టీవ్ స్మిత్ (5), జోష్ ఇంగ్లిస్ (8), మార్నస్ లాబుషాగ్నే (4), గ్లెన్ మాక్స్వెల్ (2), స్టార్క్ (3*) ఉన్నారు. కెప్టెన్ మార్ష్ 28, ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేశారు. వీరిద్దరూ జట్టుకు శుభారంభం అందించి 52 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హెడ్ ఔట్ అయిన వెంటనే ఆస్ట్రేలియన్ జట్టు కుప్పకూలింది. ఇంగ్లండ్ తరఫున మాథ్యూ పాట్స్ నాలుగు వికెట్లు తీయగా, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్‌కి ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా ఉంది.
6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣
Incredible final over hitting from Liam Livingstone 💪💥
🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N
— England Cricket (@englandcricket) September 27, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!