NTV Telugu Site icon

Liam Livingstone: లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 28 రన్స్

Living Stone

Living Stone

ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఊచకోత చూపించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో లివింగ్‌స్టోన్ 28 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 39వ ఓవర్‌లో స్టార్క్ వేసిన ఓవర్‌లో లివింగ్‌స్టోన్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. అందులో వరుసగా మూడు సిక్సర్లు కూడా ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో ఏ ఆస్ట్రేలియన్ బౌలర్ ఇన్ని పరుగులు సమర్పించలేదు. ఇంతకుముందు సైమన్ డేవిస్, క్రెయిగ్ మెక్‌డెర్మాట్, జేవియర్ డోహెర్టీ, ఆడమ్ జంపా, కామెరాన్ గ్రీన్ అత్యధికంగా ఒక ఓవర్‌లో 26 పరుగులు ఇచ్చారు.

Pure Little Hearts Foundation: ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 10 మంది గుండె జబ్బులతో జననం

27 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో లివింగ్‌స్టోన్ అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్లకు 312 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. బెన్ డకెట్ 62 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 63 పరుగులు, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 87 పరుగులు, జామీ స్మిత్ 28 బంతుల్లో 1 సాయంతో 39 పరుగులు చేశారు. కాగా.. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఆడమ్ జంపా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. స్టార్క్ ఎనిమిది ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, హేజిల్‌వుడ్‌లకు తలో వికెట్ పడగొట్టారు.

CMR Shopping Mall: నిజామాబాద్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..

313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 24.4 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 186 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోయారు. స్టీవ్ స్మిత్ (5), జోష్ ఇంగ్లిస్ (8), మార్నస్ లాబుషాగ్నే (4), గ్లెన్ మాక్స్‌వెల్ (2), స్టార్క్ (3*) ఉన్నారు. కెప్టెన్ మార్ష్ 28, ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేశారు. వీరిద్దరూ జట్టుకు శుభారంభం అందించి 52 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హెడ్ ఔట్ అయిన వెంటనే ఆస్ట్రేలియన్ జట్టు కుప్పకూలింది. ఇంగ్లండ్‌ తరఫున మాథ్యూ పాట్స్‌ నాలుగు వికెట్లు తీయగా, బ్రైడన్‌ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీశారు. ఆదిల్ రషీద్‌కి ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా ఉంది.