Krunal Pandya Creates Worst Record In IPL As Captain: లక్నో సూపర్ జెయింట్స్ (తాత్కాలిక) కెప్టెన్ కృనాల్ పాండ్యా తాజాగా తన పేరిట చెత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన కెప్టెన్‌గా అతడు రికార్డులకెక్కాడు. తొలుత సీఎస్‌కేతో రద్దైన మ్యాచ్‌లో (వర్షం కారణంగా) సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం హార్ధిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌తో మే 7వ తేదీన జరిగిన మ్యాచ్‌లోనూ తొలి బంతికే కృనాల్ డకౌట్ అయ్యాడు. కేవలం ఈ చెత్త రికార్డే కాదు.. సారథిగా జట్టుని సమర్థవంతంగా నడిపించడంలోనూ అతడు విఫలమవుతున్నాడు. తొలుత రాహుల్ గాయపడ్డ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన కృనాల్.. ఆ మ్యాచ్‌లో తన జట్టుని ఏమాత్రం గట్టెక్కించలేకపోయాడు. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. సారథిగా తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఫలితం తేలలేదు కానీ.. రెండో మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ జట్టు చేతిలో ఘోర పరాభావాన్ని ఎదుర్కున్నాడు. ఈ నేపథ్యంలోనే కృనాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Police Over Action: పోలీసుల ఓవరాక్షన్.. దుర్భాషలాడుతూ, చెయ్యి చేసుకొని..
కాగా.. మే 7న జరిగిన మ్యాచ్ విషయానికొస్తే, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (94 నాటౌట్), వృద్ధిమాన్ సాహా (81) విధ్వంసం సృష్టించడంతో.. గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయ్యింది. లక్ష్య ఛేదనలో లక్నో కూడా ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. డీకాక్ (70), కైల్ మేయర్స్ (48) రెచ్చిపోయి ఆడారు. అయితే.. మేయర్స్ ఔట్ అయ్యాక, లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుకోలేదు. డీకాక్ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో.. లక్నో 171 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా.. 56 పరుగుల తేడాతో గుజరాత్ ఘనవిజయం సాధించింది.
