KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Play With Delhi Capitals for IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నుంచి రాహుల్ ట్రేడ్ అవుతాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా పోస్టుతో ఈ రూమర్లకు తెరపడినట్లైంది. వచ్చే సీజన్లోనూ డీసీ తరఫునే బరిలోకి దిగనున్నట్లు రాహుల్ స్పష్టం చేశాడు. రాహుల్ స్వయంగా స్పందించడంతో ఢిల్లీ అభిమానులు సంబరపడిపోతున్నారు.
కేఎల్ రాహుల్‌ను ప్రశంసిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. రాహుల్‌ను ‘క్లచ్ ప్లేయర్’గా అభివర్ణించిన ఆయన.. ఢిల్లీ జట్టులో ఇంకా పూర్తి చేయాల్సిన పని చాలానే ఉందని పేర్కొన్నారు. జట్టును తనకంటే ముందు ఉంచే వ్యక్తిగా రాహుల్‌ను కొనియాడారు. ‘డీసీలో కేఎల్ రాహుల్ కీలక ఆటగాడు. నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో అతడు ఒకడు. ఎప్పుడూ తనకంటే జట్టుకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. మా లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ గర్వకారణంగా నిలిచేలా మేమిద్దరం కలిసి కష్టపడి పనిచేస్తాం’ అని పార్థ్ జిందాల్ పేర్కొన్నారు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
పార్థ్ జిందాల్ పోస్ట్‌కు కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ.. రాబోయే సీజన్ కోసం వేచి చూస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ 2027 సీజన్లోనూ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలోనే కనిపించనున్నాడనే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ రాహుల్‌ను రూ.14 కోట్లకు తీసుకుంది. రెండు సీజన్లలోనూ నిలకడైన ప్రదర్శన చేశాడు. 2025లో 539 పరుగులు చేసిన రాహుల్.. 2026 సీజన్లో 593 పరుగులతో రాణించాడు. ఢిల్లీకి రాకముందు రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడు సీజన్ల పాటు నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఢిల్లీతో ఆటగాడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
Thank you , can’t wait for the coming season . 💙 https://t.co/loH9FUXylq
— K L Rahul (@klrahul) September 7, 2026
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!