Site icon NTV Telugu

Kasturi: కేఎల్ రాహుల్ అండర్‌వేర్ యాడ్‌కు సీనియర్ నటి ఫిదా

Fd51b53b29ea99abd5350f9e955de069

Fd51b53b29ea99abd5350f9e955de069

టీమిండియా స్టార్ బ్యాటర్ KL రాహుల్ ను ప్రశంసలతో ముంచెత్తింది ప్రముఖ సీనియర్ నటి కస్తూరి. రాహుల్ చేసిన ధైర్యం తనను ఎంతగానో ఆకట్టుందని ఆమె తెలిపింది.తాజాగా KL రాహుల్ ఓ అండర్ వేర్ యాడ్‌లో నటించాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సాధారణంగా క్రికెటర్లు ఇలాంటి యాడ్స్ చేయడానికి పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కొత్త సంప్రదాయానికి నాంది పలికాడు. ఇదే విషయం ఇప్పుడు కస్తూరిని ఎంతగానో ఆకట్టుకుందంట. ఈ సందర్భంలోనే KL రాహుల్‌ను అభినందిస్తూ ఈ సీనియర్ నటి ట్వీట్ చేసింది.

“క్రికెటర్లు మాములుగా కూల్ డ్రింక్స్, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, దుస్తుల బ్రాండ్లకు ప్రచారం చేయడం చూస్తుంటాం. కానీ లోదుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు మాత్రం వారు సిగ్గుపడుతూ పెద్దగా ముందుకురారు. కానీ రాహుల్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అండర్ వేర్స్ యాడ్ చేశాడు. రాహుల్‌ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని కస్తూరి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version