Site icon NTV Telugu

IPL 2022: నితీష్ రానా, ఆండీ రసెల్ మెరుపులు.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

Kkr Min

Kkr Min

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత పొదుపుగా బౌలింగ్ చేసింది. అయితే చివర్లో భారీగా పరుగులు సమర్పించుకుంది. దీంతో 20 ఓవర్లకు కోల్‌కతా జట్టు 175/8 స్కోరు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 176 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో నితీష్ రానా(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

ఇన్నింగ్స్ చివర్లో రసెల్(49 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మిగిలిన వారిలో శ్రేయాస్ అయ్యర్ (28) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. మినహా మిగతా ఎవరూ రాణించలేదు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ తన యార్కర్లతో మూడు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ 2, మార్కో జాన్సెన్, భువనేశ్వర్, సుచిత్ జగదీషా తలో వికెట్ తీశారు.

IPL 2022: అప్పుడు లయన్స్.. ఇప్పుడు టైటాన్స్

Exit mobile version