త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ పీవర్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. బీసీసీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ వేదికల్లో పొగాకు, మద్యం ప్రకటనలు, అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ప్రజారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని పొగాకు, మద్యం ప్రకటనలు, సర్రోగేట్ ప్రమోషన్లు, స్టేడియంలు, టెలివిజన్ ప్రసారాల్లో పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. బీసీసీఐను కోరింది.
ఇది కూడా చదవండి: MLC Nominations: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం
మార్చి 5న ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ అనుబంధ ఈవెంట్లు, క్రీడా వేదికల్లో పొగాకు మరియు ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రకటనలు నిషేధించాలని కోరారు. క్రికెటర్లు ప్రకటనలు ఇవ్వడంతో యువత ప్రేరణకు గురవుతారని తెలిపింది. సామాజిక, నైతిక బాధ్యత వహిస్తూ అలాంటి ప్రకటనలు మానుకోవాలని గోయెల్ పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Robinhood : అదిదా సర్ప్రైజ్ ప్రోమో.. మల్లెపూలతో మత్తెక్కిస్తున్న ‘కేతిక కెవ్వు కేక’