Site icon NTV Telugu

IPL 2022: విలియమ్సన్ అవుట్‌పై దుమారం.. బీసీసీఐకి SRH లేఖ

Williamson Out

Williamson Out

ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్‌ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే ఈ క్యాచ్ గ్రౌండ్‌ను తాకిందని సన్‌రైజర్స్ టీమ్ వాదిస్తోంది.

అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన హైపిచ్ బంతిని విలియమ్సన్ డిఫెన్స్ చేశాడు. అయితే బంతి కుడివైపు స్లిప్స్‌లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ సంజు శాంసన్ కుడివైపు డైవ్ చేసినప్పటికీ బంతిని అందుకోలేకపోయాడు. తొలుత అతిన గ్లోవ్స్‌లో పడి మళ్లీ గాల్లోకి లేచిన బంతిని స్లిప్స్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అతడి చేతుల్లోకి వెళ్లకముందే ఆ బంతి గ్రౌండ్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడాన్ని సన్‌రైజర్స్ టీమ్ ఖండించింది. తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. థర్డ్ అంపైర్ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. తాము లేఖ రాసిన విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు.

https://ntvtelugu.com/kolkata-knight-riders-won-by-4-wickets-against-punjab-kings/

Exit mobile version