IND vs NZ Final 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం (మార్చ్ 9న) దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే, అద్భుతమైన విజయాలతో 2000 సంవత్సరంలో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్ జట్టు ఊపు చూస్తే ట్రోఫీ గెలవడం ఖాయంగా కనిపించింది. కానీ, తుదిపోరులో అంతా తలకిందులైపోయింది. కప్పును న్యూజిలాండ్ టీమ్ ఎగరేసుకుపోయింది. మరోసారి, రోహిత్ సేనకు కప్ కొట్టకుండా ఇద్దరు కివీస్ ప్లేయర్లు అడ్డుపడేలా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర.. వీరు ఫైనల్లో చెలరేగిపోతే న్యూజిలాండ్ ను ఆపడం భారత వల్ల కాదు. కాబట్టి తొందరగా వీరిని పెవిలియన్ కి పంపించేలా టీమిండియా ప్లాన్ చేసుకోవాలి.
Read Also: Kingston Review: కింగ్స్టన్ రివ్యూ.. జీవీ ప్రకాష్ కుమార్ హారర్ సినిమా ఎలా ఉందంటే ?
అయితే, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడే వ్యక్తి కేన్ విలియమ్సన్. ఏమాత్రం ఒత్తిడికి లోనూ కాకుండా.. కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌తో మిడిలార్డర్‌లో ఉన్న డరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్‌కు పని తేలికైపోతుంది. ఇప్పటి వరకు, కేన్ మామ 4 మ్యాచ్‌ల్లో 189 పరుగులు కొట్టగా.. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, కేవలం బ్యాటింగ్‌లో మాత్రమే కాదు అటు ఫీల్డింగ్‌లోనూ అతడు అదరగొడుతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో రెండు మెరుపు క్యాచ్‌లు పట్టి అందర్ని అశ్చర్యానికి గురి చేశాడు. కెప్టెన్‌గా తన అనుభవాన్ని ప్రస్తుత సారథి మిచెల్ శాంట్నర్‌కు పంచుతూ టీమ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు కేన్ విలియమ్సన్.
Read Also: Kalpana : రూమర్స్ కు చెక్ పెడుతూ సింగర్ కల్పన సెల్ఫీ వీడియో..
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు ప్రధాన ఆయుధంగా మారాడు రచిన్ రవీంద్ర. ఈ టోర్నీలో మరో ఓపెనర్ విల్ యంగ్ పెద్దగా రాణించకపోవడంతో కివీస్ భారీ స్కోర్లు చేసిందంటే అది కేవలం రచిన్ స్థిరతమైన బ్యాటింగ్ అని చెప్పాలి. స్పిన్, పేస్‌ను దీటుగా ఎదుర్కొంటూ రన్స్ సాధిస్తున్నాడు ఈ లెఫ్ట్‌హ్యాండర్.. బంతిని గాల్లోకి లేపకుండా ఎక్కువగా గ్రౌండ్ షాట్లతోనే భారీగా పరుగులు రాబట్టడం ఇతడి శైలి. భారత్‌తో ఫైనల్లోనూ కివీస్ రచిన్ పైనే ఎక్కువగా ఆధారపడనుంది. స్టార్టింగ్ లో అతడు మంచి ఆరంభం ఇస్తే తర్వాత సంగతి మిగతా బ్యాటర్లు చూసుకుంటారనేది న్యూజిలాండ్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
Read Also: Chhaava Review : విక్కీ కౌశల్ – రష్మిక’ల చావా రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర భారత్‌తో జరిగే ఫైనల్ పోరులో ఎలా రాణిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఏ ఒకరు కుదురుకున్నా రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడడంతో భారత్ కు సానుకూలాంశం అని చెప్పాలి. ఇక, ట్రోఫీలో చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోవడంతో శాంటర్న్ సేన కసి మీద ఉంది. ఈ నేపథ్యంలో రచిన్, కేన్‌తో పాటు మిగిలిన జట్టు కూడా ఫైనల్‌ను అంత తేలిగ్గా వదిలే ఛాన్స్ లేదు.. తటస్థ వేదికల్లో రెండు జట్లు 32 వన్డేల్లో పోటీ పడగా భారత్-కివీస్ చెరో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.