Site icon NTV Telugu

Jos Buttler: 37 అవార్డులు.. రూ.98 లక్షల ప్రైజ్‌మనీ

Joss Buttler

Joss Buttler

ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో దుమ్మురేపాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 863 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 57.53గా నమోదైంది. బట్లర్ ఒకవైపు పరుగుల వర్షంతో పాటు అవార్డుల వర్షాన్ని కూడా కురిపించాడు. ఈ సీజన్‌లో బట్లర్ ఏకంగా 37 అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డుల ద్వారా రూ.98 లక్షల ప్రైజ్‌మనీని బట్లర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Kasturi: కేఎల్ రాహుల్ అండర్‌వేర్ యాడ్‌కు సీనియర్ నటి ఫిదా

బట్లర్ పొందిన అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లే ప్లేయర్ వంటి పురస్కారాలు ఉన్నాయి. రూ.60 లక్షలను గెలుచుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచినందుకు రూ.10 లక్షల క్యాష్ రివార్డు లభించింది. ఇక ఈ సీజన్‌లో 45 సిక్స్‌లు, 83 ఫోర్లు కొట్టడంతో మ్యాగ్జిమమ్ సిక్స్‌‌లు, మ్యాగ్జిమమ్ ఫోర్స్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లెక్కన పదేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అతడి ఖాతాలో చేరాయి. ఈ సీజన్ గేమ్ ఛేంజర్ అవార్డుతో పాటు పవర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను కూడా గెలుచుకున్న బట్లర్ మరో రూ.30 లక్షల నగదును తన ఖాతాలో వేసుకున్నాడు. లీగ్ స్టేజ్‌లో రెండు సార్లు, క్వాలిఫయర్-2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను బట్లర్ అందుకున్నాడు. వీటి ద్వారా రూ.7 లక్షలు సాధించాడు. వివిధ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో రూ.28 లక్షలు కైవసం చేసుకున్నాడు. ఈ లెక్కన మొత్తం రూ.98 లక్షలను అవార్డుల ద్వారానే సంపాదించాడు.

Exit mobile version