Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై తన టెస్టు సెంచరీ చేశాడు. గత 12 ఏళ్లుగా శతకం ప్రయత్నిస్తున్న రూట్ ఎట్టకేలకు తన కలను సాగారం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ జట్టు బ్యాటింగ్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. కాగా, ఓపెనర్ జాక్ క్రాలీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రూట్ 181 బంతుల్లో తన 40వ టెస్టు సెంచరీ మార్క్‌ను క్రాస్ చేశాడు. ఓవరాల్‌గా ఇది అతడికి 59వ ఇంటర్నేషన్ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ 2025లో ఇప్పటికే నాలుగు టెస్ట్ శతకాలు నమోదు చేశాడు. జో రూట్ ప్రస్తుతం 135 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.
అయితే, యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 329 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌తో పాటు ఆర్చర్ ఉన్నాడు. వీరిద్దరూ 10వ వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం జత చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి రోజే ఆలౌట్ అయ్యేలా కన్పించింది. కానీ రూట్, ఆర్చర్ చివరి వికెట్ ఇవ్వకుండా పోరాడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు పడగొట్టగా.. నసీర్, బోలాండ్ తలా వికెట్ తీసుకున్నారు. ఇక, అత్యధికంగా 40 టెస్ట్ సెంచరీలతో ఉన్న శ్రీలంక దిగ్గజం సంగక్కరను జో రూట్ అధిగమించినప్పటికీ.. అతడి కంటే ముందు వరుసలో రికీ పాంటింగ్ (41), జాక్వెస్ కాలిస్ (45), సచిన్ టెండూల్కర్ (51) ఉన్నారు. రాబోయే రోజుల్లో పాంటింగ్, కాలిస్‌ల రికార్డులను సైతం రూట్ అధిగమించే అవకాశం ఉంది.
Read Also: CM Revanth Reddy : ఎర్ర బస్సు ఎరుగని ప్రాంతంలో ఎయిర్ బస్సు దింపుతాం
ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సెంచరీ చేసిన అత్యధిక ఇన్నింగ్స్‌లు
* 41 – ఇయాన్ హీలీ
* 36 – బాబ్ సింప్సన్
* 32 – గోర్డాన్ గ్రీనిడ్జ్/స్టీవ్ వా
* 30 – జో రూట్
గబ్బాలో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ సెంచరీలు
* 126- మారిస్ లేలాండ్ 1936/37
* 110- టోనీ గ్రెయిగ్ 1974/75
* 138- ఇయాన్ బోథమ్ 1986/87
* 116- మార్క్ బుచర్ 1998/99
* 110- ఆండ్రూ స్ట్రాస్ 2010/11
* 235*- అలస్టైర్ కుక్ 2010/11
* 135*- జోనాథన్ ట్రాట్ 2010/11
* 100*- జో రూట్ 2025/26
