NTV Telugu Site icon

Jaydev Unadkat: చరిత్ర సృష్టించిన జయదేవ్.. ట్రోఫీ హిస్టరీలోనే తొలిసారి

Jaydev Unadkat Hattrick

Jaydev Unadkat Hattrick

Jaydev Unadkat Creates History By Taking Hattrick Wickets On Ranji Trophy: భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కట్ తాజాగా రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జయదేవ్.. రాజ్‌కోట్‌లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఒక రంజీ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం.. ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా జయదేవ్ తన పేరిట అత్యంత అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. 2017-18లో కర్ణాటక పేసర్ వినయ్ కుమార్ కూడా ఇలాంటిదే హ్యాట్రిక్ రికార్డ్ సాధించాడు కానీ.. అది తొలి-మూడు ఓవర్‌ల మధ్య ఉంది. అంటే.. తొలి ఓవర్ చివరి బంతికి ఒక వికెట్ తీసి, ఆ తర్వాత మూడో ఓవర్‌లోని తొలి రెండు బంతులకి రెండు వికెట్లు తీసి, హ్యాట్రిక్ అందుకున్నాడు.

Urinates On Woman: విమానంలో మద్యం తాగి.. మహిళపై మూత్ర విసర్జన

అయితే.. జయదేవ్ మాత్రం తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు. తొలి ఓవర్‌లోని మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా ధ్రువ్ షోరే, రావల్, యశ్‌దుల్‌ను ఔట్ చేశాడు. ఇలా ఈ హ్యాట్రిక్ రికార్డ్ సాధించడమే కాదు, ఇదే జోరుని కొనసాగించి మరో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తం 12 ఓవర్లు వేసి, కేవలం 39 పరుగులే ఇచ్చి, 8 వికెట్లు తీశాడు. జయదేవ్ దెబ్బకు ఢిల్లీ జట్టు పేకమేడలా కుప్పకూలింది. 133 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొత్తం ఆరుగురు ఆటగాళ్లు డకౌట్ అవ్వగా, అందులో ముగ్గురు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఒకప్పుడు పరుగులు సమర్పించుకునే బౌలరని ట్రోలింగ్స్‌కి గురైన జయదేవ్.. ఇప్పుడు రికార్డులకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. 12 ఏళ్ల తర్వాత ఇతడు భారత టెస్ట్ జట్టులోకి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే! బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌తో ఇతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Pathaan: పఠాన్‌కి షాకిచ్చిన CBFC.. సినిమా వాయిదా?