NTV Telugu Site icon

Jayadev Unadkat: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జయదేవ్.. తొలి భారత క్రికెటర్‌

Jaydev Ipl Record

Jaydev Ipl Record

Jayadev Unadkat Creates New Record In IPL As Indian Cricketer: ఐపీఎల్ చరిత్రలో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్ల తరపున ఆడిన ఆటగాడిగా జయదేవ్ నిలిచాడు. ఇప్పటివరకూ ఇతడు ఐపీఎల్‌లో మొత్తం 7 జట్ల తరఫున ఆడాడు. తొలుత 2010లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఇతడు ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అనంతరం 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరఫున ఆ ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతడు.. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రంగంలోకి దిగాడు. 2016 సీజన్ వరకూ ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2017లో పుణే సూపర్‌ జెయింట్స్‌, 2018లో రాజస్థాన్‌ రాయల్స్‌కు పప్రాతినిథ్యం వహించాడు.

Bandi Sanjay: సింహం సింగిల్‎గానే వస్తుంది.. ఎగిరేది బీజేపీ జెండానే

రాజస్థాన్ జట్టుకి కీలక బౌలర్‌గా అవతరించడంతో.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ యాజమాన్యం అతడ్ని రిటెయిన్ చేసింది. అంటే.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ తరఫున అతగడు ఆడాడు. అయితే.. ఐపీఎల్‌-2022కు ముందు రాజస్థాన్ అతడ్ని రిలీజ్ చేసింది. అప్పుడు నిర్వహించిన మెగా వేలంలో.. ముంబై ఇండియన్స్ జట్టు అతడ్ని కొనుగోలు చేసింది. అయితే.. అతడు పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవడంతో, ముంబై కూడా అతడిని ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్‌-2023 మినీ వేలంలో లక్నో జట్టు అతడ్ని సొంతం చేసుకుంది. ఇలా అతడు ఏడు జట్ల తరఫున ఆడిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇప్పటివరకూ ఫించ్ ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

SRH vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న సన్‌రైజర్స్