NTV Telugu Site icon

IND vs SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు ఔట్?

Jasprit Bumrah Out

Jasprit Bumrah Out

Jasprit Bumrah Ruled Out Of 3-Match ODI Series: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు తాజాగా భారీ షాక్ తగిలింది. కొంతకాలం నుంచి జట్టుకి దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ వన్డే సిరీస్‌కి గాను జట్టులో అడుగుపెట్టినట్టే పెట్టి, ఆ వెంటనే దూరమయ్యాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్లే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడ్ని జట్టు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. దీంతో బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లోనే ఉండిపోయాడు. అయితే.. బుమ్రాని తప్పించడానికి ఫిట్‌నెస్ కారణం కాదని, వేరే కారణాలున్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో టీమిండియా కొన్ని కీలక సిరీస్‌లు ఆడేందుకు రెడీ అవుతోంది. వాటిల్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, అలాగే వన్డే వరల్డ్‌కప్ ఎంతో ముఖ్యమైనవి. అప్పుడు జట్టులో బుమ్రా లాంటి కీలక ఆటగాడు తప్పకుండా ఉండాలి. కాబట్టి.. ఆలోపు అతడు మరోసారి గాయాలబారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, అతడ్ని ఉద్దేశపూర్వకంగానే ఈ శ్రీలంక వన్డే సిరీస్‌కు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఒక రకంగా బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు.

Harassment Case: లైంగిక వేధింపుల కేసు.. సందీప్‌ సింగ్‌పై 7గంటల పాటు ప్రశ్నల వర్షం

కాగా.. లంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్లైన రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి లేకుండా యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా.. 2-1 తేడాతో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగడం, బౌలర్లు సైతం మాయ చేయడంతో.. 91 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగలిగింది. దీంతో, సిరీస్ భారత్ కైవసం అయ్యింది. ఇదే జోరులో వన్డే సిరీస్‌ని కూడా చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. రేపు తొలి వన్డే మ్యాచ్ గౌహాతిలో జరగనుండగా.. మిగిలిన రెండు మ్యాచెస్ గురువారం (కోల్‌కతా), ఆదివారం (త్రివేండ్రం) జరగనున్నాయి.

Gautam Gambhir: సూర్యకుమార్‌పై గౌతమ్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్

లంకతో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్