Site icon NTV Telugu

బయో-బబుల్ ప్రభావం పెరుగుతుంది : బుమ్రా

ఐసీసీ ప్రపంచ కప్ లో భారత జట్టు ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. ఆ రెండు మ్యాచ్ లలో జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేయగా.. ఆ తర్వాత కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఈ మ్యాచ్ లో ఆ రెండు వికెట్లు తీసింది భారత పేసర్ బుమ్రా. అయితే మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ… ఆటగాళ్ల పైన బయో-బబుల్ ప్రభావం పెరుగుతుంది అని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా ఆటగాళ్లు ఓ బయో బబుల్ లో మాత్రమే ఉండాలి. బబుల్ బయట ఉన్న వ్యక్తులను ఎవరిని కలవకూడదు. ఇక దాదాపుగా గత ఇంగ్లాండ్ పర్యటన నుండి ఆటగాళ్లు ఈ కరోనా బయో బబుల్ లోనే ఉంటున్నారు. అందువల్ల ఆటగాళ్లు మానసికంగా బలహీనపడుతున్నారు అని బుమ్రా చెప్పాడు.

Exit mobile version