NTV Telugu Site icon

Jansen vs Rashid: దెబ్బకు దెబ్బ.. రషీద్‌పై జాన్సెన్ ప్రతీకారం

Jansena Revenge Rashid

Jansena Revenge Rashid

Jansen Take Revenge On Rashid Khan In South Africa T20 League: ప్రతీకారం అంటే ఇది. దాదాపు 267 రోజుల తర్వాత రషీద్‌ ఖాన్‌పై మార్కో జాన్సెన్ తీర్చుకున్న రివేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిరుడు ఐపీఎల్ సందర్భంగా జాన్సెన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ భారీగా పరుగులు రాబట్టుకోగా.. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రషీద్ బౌలింగ్‌ను జాన్సెన్ ఊచకోత కోశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ రివేంజ్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Chiranjeevi: మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్-సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యా్చ్‌లో సన్‌రైజర్స్ 2 వికెట్లతో విజయం సాధించింది. జాన్సెన్ 27 బంతుల్లో 66 రన్స్‌తో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇందులో రషీద్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జాన్సెన్ విశ్వరూపమే చూపించాడు. పేరుకు బౌలర్‌ అయినా ఏమాత్రం తగ్గకుండా 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో మొత్తం 28 రన్స్ పిండుకున్నాడు. దీంతో గతంలో ఐపీఎల్‌లో రషీద్‌పై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లైంది.

Bride Ride In The Metro: పెళ్లి కూతురు స్మార్ట్‌ ఛాయిస్.. వైరల్‌గా మారిపోయింది..

అసలు ఏం జరిగిందంటే!
గతేడాది ఏప్రిల్ 27న సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ మ్యా్చ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండర్ రషీద్ బ్యాట్‌కు పనిచెప్పాడు. రైజర్స్ బౌలర్ జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఏకంగా 25 రన్స్ రాబట్టాడు. ఇందులో 4 సిక్సర్లతో పాటు ఓ సింగిల్ ఉంది. తాజాగా 267 రోజుల తర్వాత జాన్సెన్ రషీద్ బౌలింగ్‌ను ఊచకోత కోసి రివేంజ్ తీర్చుకున్నాడు.