Jack Grealish and Guillermo Ochoa involved in fight: బుధవారం రాత్రి మాంచెస్టర్ సిటీ, క్లబ్ అమెరికా మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్ రసాభాసగా మారింది. మెక్సికో గోల్ కీపర్ గిల్లెర్మో ఓచోవా, మాంచెస్టర్ సిటీ మిడ్‌ఫీల్డర్ జాక్ గ్రీలిష్ దాదాపు కొట్టుకున్నంత పని అయ్యింది. అసలేం జరిగిందంటే.. ఆట కొనసాగుతున్న 25వ నిమిషంలో జాక్ గోల్ కొట్టబోతున్నప్పుడు, ప్రత్యర్థి ఆటగాడు అడ్డొచ్చాడు. అప్పుడు జాక్ కింద పడి, గిల్లెర్మో దాకా దొర్లుకుంటూ వెళ్లాడు. స్పోర్ట్స్‌మ్యాన్షిప్‌లో భాగంగా అతడ్ని పైకి లేవమని గిల్లెర్మో స్నేహపూర్వకంగా చెప్పాడు.
కానీ, జాక్ మాత్రం దురుసుగా ప్రవర్తించాడు. అతడు చేయూతనందిస్తే, నాకు నీ సహకారం వద్దన్నట్టు జాక్ ప్రవర్తించాడు. సహాయం చేస్తుంటే, నన్నే అంటావా అన్నట్టు.. గిల్లెర్మో అతడ్ని ముందుకు నెట్టాడు. దీంతో కోపాద్రిక్తుడైన జాక్.. గిల్లెర్మోని నెట్టేశాడు. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టుగా.. గిల్లెర్మో అతడ్ని నెట్టాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఇంతలో తోటి ఆటగాళ్లు కలగజేసుకొని, ఇద్దరినీ విడిపించే ప్రయత్నం చేశారు. అప్పటికీ శాంతించని జాక్.. గిల్లెర్మోని తిడుతూనే ఉన్నాడు. దాంతో జాక్‌పై అతడు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. ఇరుజట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరిని విడదీశారు.
జాక్ గ్రీలిష్ రెండు సార్లు ఈ ఆటలో భాగంగా ప్రత్యర్థులతో గొడవకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 2-1 తేడాతో క్లబ్ అమెరికాపై విజయం సాధించింది. మాంచెస్టరసిటీ మిడ్ ఫీల్డర్ కెవినడిబ్రూయెన్ ఆట మొదటి భాగంలో ఒకటి, రెండో భాగంలో మరొక గోల్ కొట్టి.. జట్టుకి విజయాన్నందించాడు.
https://twitter.com/ManagerTactical/status/1549939369364045826?s=20&t=lMQZfSLSbP_US1hxuKpnhA