Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెల్లడించాడు.
వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు:
రెండో టీ20లో 44 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ చాలా తెలివైన ఆటగాడు. ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానంలో ఎలా ప్రవర్తించాలో, మైదానం బయట ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వచ్చిన నేపథ్యం కారణంగా చుట్టూ ఎన్నో ఆకర్షణలు, దృష్టి మళ్లించే అంశాలు ఉంటాయి. నేను కూడా అదే పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి వాటి ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని ఇషాన్ తెలిపాడు.
Also Read
- Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
- Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
- IND vs NZ 2nd Test: జడేజా, సిరాజ్‌లను పక్కన పెట్టారు.. భారీ మూల్యం చెల్లించారు!
- IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
బయట విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం:
వైభవ్ సోషల్ మీడియా, బయట జరుగుతున్న ప్రచారం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండేలా భారత జట్టు ప్రయత్నిస్తోందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ‘నేను మాత్రమే కాదు.. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, జట్టులోని ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా వైభవ్‌తో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని చెబుతున్నాం. ప్రస్తుతం అతను పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలి. సోషల్ మీడియాలో ఏమి జరుగుతోంది, బయట ఎవరు ఏమంటున్నారు అనే విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నాం. ఒకవేళ పరుగులు చేయకపోయినా నిరాశ చెందకుండా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటాం’ అని పేర్కొన్నాడు.
చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు:
వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని ఇషాన్ కిషన్ ప్రశంసించాడు. ‘వైభవ్ లాంటి బ్యాటర్ పవర్‌ప్లేలో క్రీజులో ఉంటే తొలి ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 నుంచి 90 పరుగులకు వెళుతుంది. అలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదు. అందుకే మేమంతా అతనికి అన్నల్లా అండగా నిలుస్తున్నాం. మేము మా కెరీర్ ప్రారంభంలో చేసిన తప్పులను అతను చేయకుండా చూసుకోవడమే మా బాధ్యత. మానసికంగా, శారీరకంగా సరైన దారిలో ముందుకు వెళ్లేలా సహాయం చేస్తున్నాం. వైభవ్ ఎప్పుడూ సంతోషంగా క్రికెట్ ఆడుతూ తన ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Nani: ‘నాని’ బ్రాండ్ ఉంటేనే చిన్న సినిమాలకు ఆదరణ?
-
Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
-
Meenakshi Chaudary : ఆ సీక్రెట్ లీక్ చేస్తే డైరెక్టర్ నన్ను చంపేస్తారు!”
-
Alias Rukmini : వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను నమ్మి రిస్క్ చేశారా?
-
Alias Rukmini: ‘వృషకర్మ’తో నాని టీమ్ పోటీ.. డిసెంబర్ 4 రిలీజ్ వెనుక అసలు రహస్యమిదే!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!