Ishan Kishan Creates Another World Record With His Double Century: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలిసిందే. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అతగాడు.. కేవలం 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సుల సహకారంతో 210 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టాడు. కెరీర్‌లో తొమ్మిదో ఇన్నింగ్స్‌లోనే డబుల్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా (24 ఏళ్ల 145 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఈ ఘటన సాధించడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఏకంగా 431 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌కు 234 ఇన్నింగ్స్‌లు, మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మకు 103 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
RRR in Japan: యాబై రోజుల్లో మూడు దశాబ్దాల రజినీ రికార్డ్ కి ఎండ్ కార్డ్…
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (126 బంతుల్లో) నమోదు చేసిన క్రికెటర్‌గానూ చరిత్రపుటలకెక్కిన ఇషాన్ ఖాతాలోకి లేటెస్ట్‌గా మరో రికార్డ్ వచ్చి చేరింది. వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండానే.. నేరుగా డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత ఏ ఆటగాడి పేరిట లేదు. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లీ (113) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేయగలిగింది. 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. టీమిండియా బౌలర్ల ధాటికి 182 పరుగులకే కుప్పకూలింది. కాకపోతే.. ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, ఈ వన్డే సిరీస్‌ని బంగ్లా కైవసం చేసుకుంది. ఇషాన్, కోహ్లీ పుణ్యమా అని.. బంగ్లా చేతిలో భారత్ క్లీన్ స్వీప్ అవ్వకుండా బయటపడింది.
Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..